ప్రికాషనరీ డోస్ గడువు తగ్గించండి

ప్రికాషనరీ డోస్  గడువు  తగ్గించండి

కోవిడ్ మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో సెకండ్ డోస్, ప్రికాషనరీ డోస్ మధ్య ఉన్న గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు  కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు హరీష్ రావు లేఖ రాశారు. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోస్, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే, 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ  ప్రికాషనరి డోసు ఇవ్వాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాలకు సంబంధించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు హరీష్ రావు. 


READ MORE

పండిట్ ల క్రికెట్ మ్యాచ్ కు నెటిజన్లు ఫిదా