మ్యూజిక్ కన్సర్ట్‌లో చిరిగిన హ్యారీ స్టైల్స్ ప్యాంటు

మ్యూజిక్ కన్సర్ట్‌లో చిరిగిన హ్యారీ స్టైల్స్ ప్యాంటు

ఇటీవల లాస్ ఏంజిల్స్ లో ఓ మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్న హ్యారీ స్టైల్స్ కు వింత అనుభవం ఎదురైంది. పాట పాడుతుండగా తన ప్యాంటు చిరిగిపోవడంతో కాసేపు అక్కడి వాతావరణమంతా నవ్వుల్తో నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం జరిగిన ఈ సంఘటనలో 'మ్యూజిక్ ఫర్ ఎ సుషీ రెస్టారెంట్' పాటను హ్యారీ స్టైల్స్ ఫర్ఫామ్ చేస్తుండగా.. 
ఆడియెన్స్ ను అలరించేందుకు మోకాలిపై కూర్చొని ఓ ఫోజ్ ఇచ్చాడు. అప్పుడే సడన్ గా అతని ఫ్యాంటు చిరిగిపోయింది. వెంటనే అలర్ట్ అయిన సాంగ్ పాడడాన్ని ఆపేసిన హ్యారీ..  నవ్వుతూ వెనక్కి వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత స్టేజీ వెనక్కి వెళ్లి హ్యారీ మరొక ప్యాంటును మార్చుకొని వచ్చి, ఈవెంట్ ను కంటిన్యూ చేశాడు. వేదికపైకి రాగానే తనకు కలిగిన అసౌకర్యాన్ని గురించి ప్రస్తావిస్తూ.. తన ప్యాంటు చిరిగిపోయిందని, అందుకు అసౌకర్యంగా భావించిన వారికి క్షమాపణలు అంటూ హ్యారీ తన అభిప్రాయం తెలియజేశాడు. అదే సమయంలో ఆడియెన్స్ లో ఎవరో ఒకర్ని చూపిస్తూ.. సార్ మీరు బాగున్నారా.. ఇది షోలో భాగం కాదు అంటూ హ్యారీ చెప్పడం అందర్నీ మరింత ఎంటర్టైన్ చేసింది.