
హైదరాబాద్ : ‘భూమి పైన జనాభా తగ్గిపోతోంది’, ‘మార్స్ మీదకు జనాలను పంపిస్తాం’.. ఇలాంటి ఫేమస్ ట్వీట్లు చేయకముందే టెస్లా బాస్ ఎలన్ మస్క్ యువతకు బంగారంలాంటి ఒక సలహా ఇచ్చారు. ఈ సలహా అతని చెల్లి టోస్కా మస్క్ విషయంలోను, ఇండియన్ బిలియనీర్ ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా విషయంలోనూ బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. ‘ఒక వ్యక్తికి, ప్లేస్‌కు, ఆర్గనైజేషన్‌కు లేదా ప్రాజెక్ట్‌కు అటాచ్ అవ్వొద్దు. ఒక మిషన్‌కు, లక్ష్యానికి, పనికి మిమ్మల్ని మీరు అటాచ్ చేసుకోండి. ఈ విధంగానే మీ శక్తిని, మనశ్శాంతిని నిలుపుకోగలుగుతారు’..మస్క్ చేసిన ఈ సలహాను హర్ష్ గోయెంకా తాజాగా ట్విటర్‌లో పంచుకున్నారు.
తాను ఎదగడంలో అన్న ఇచ్చిన సలహాలు బాగా పనిచేశాయని మస్క్ చెల్లి టోస్కా కూడా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ‘నీ కంపెనీలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో బాగా కనిపెట్టు. ఎందుకంటే వాళ్లతో ఎప్పటికీ కలిసి ఉండాల్సి ఉంటుంది’ అని మస్క్ ఇచ్చిన ఒక సలహాను ఆమె పంచుకున్నారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ పాసెన్‌ఫ్లిక్స్‌ను టోస్కా నడుపుతున్నారు. కిందటేడాది ఓ ‘లెక్స్ ఫ్రైడ్‌మన్ పోడ్‌కాస్ట్’లో ఎలన్ మస్క్ యువతకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఫేమస్ అవుతామని ఏ కెరీర్‌ను ఎంచుకోవద్దని, దానికంటే మీ స్కిల్స్‌కు తగ్గ, మీరు బాగా చేయగలిగే జాబ్‌ని చూసుకోండని ఆయన అప్పుడు పేర్కొన్నారు.