కేంద్ర మంత్రి హర్షవర్ధన్​కు డబ్ల్యూహెచ్‌వోలో కీలక పదవి

కేంద్ర మంత్రి హర్షవర్ధన్​కు డబ్ల్యూహెచ్‌వోలో కీలక పదవి
  • ఈ నెల 22 న నియామకం

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ ఈ నెల 22 న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 34 మంది సభ్యులున్న డబ్ల్యూహెచ్​వో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు జపాన్ కు చెందిన హిరోకి నకతాని చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో హర్షవర్ధన్ నియమితులు కానున్నారు. ఈ పదవికి ఇండియాను నామినేట్ చేయాలని ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య కిందటేడాది ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు194 దేశాల సభ్యత్వం కలిగిన డబ్ల్యూహెచ్​వో ..ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌ పదవికి ఇండియా నామినీని నియమించే ప్రతిపాదనపై మంగళవారం సంతకం చేసింది. మే 22 న జరిగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో హర్షవర్ధన్ ఎన్నికవుతారని అధికారులు తెలిపారు.