ఆడోళ్లయినా.. మగోళ్లయినా.. సింగిల్ అయితే చాలు నెలనెలా డబ్బులు

ఆడోళ్లయినా.. మగోళ్లయినా.. సింగిల్ అయితే చాలు నెలనెలా డబ్బులు

అవివాహితులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన హర్యానా ప్రభుత్వం... తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించింది. వార్షిక ఆదాయం 1.80 లక్షల లోపు ఉండి, 45 నుంచి 60ఏళ్ల లోపు వయసున్న వారు దీనికి అర్హులు. ఆడోళ్లయినా.. మగోళ్లయినా.. సింగిల్ అయితే చాలు వారికి నెలనెలా రూ. 2వేల 750 పెన్షన్  ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. 

వితంతువుల‌కు కూడా ఆయ‌న పెన్షన్‌ను ప్రకటించారు. 40 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య ఉన్న వితంతువుల‌కు ప్రతినెలా రూ.2750 ఇవ్వనున్నారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 ల‌క్షల లోపు ఉండాలి.  వచ్చే నెల నుంచి  ఈ పథకం ఆమల్లోకి వస్తుందని, ఆర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  ఈ పెన్షన్ స్కీమ్‌ కోసం  రాష్ట్ర ప్రభుత్వం 240 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని సీఎం చెప్పారు.

 డేటా ప్రకారం, రాష్ట్రంలో 65 వేల మంది అవివాహిత పురుషులు, మహిళలు ఉన్నారు.  5వేల 687 మంది వితంతువులు ఉన్నారు. ఈ లబ్ధిదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు.