
తనతో భేటీ అయిన ప్రతీ ఒక్కరూ హోం ఐసోలేషన్ లో ఉండాలంటూ సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ విజ్ఞప్తి చేశారు.
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ కు కరోనా సోకింది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా..ఆయన కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా టెస్ట్ లు చేయగా ..అందులో ఖత్తర్ కు కరోనా సోకినట్లు తేలింది.
గత వారంలో ఖత్తర్ కేంద్ర మంత్రి గంజేద్ర సింగ్ షేఖావత్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం అంటే ఆగస్ట్ 21న గజేంద్ర సింగ్ కు కరోనా టెస్ట్ లు చేయగా అందులో ఆయన పాజిటీవ్ వచ్చింది. దీంతో హర్యానా సీఎం మూడు రోజుల పాటు హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఈరోజు టెస్ట్ లు చేయగా ఖత్తర్ గా పాజిటీవ్ అని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తనతో భేటీ అయిన ప్రతీ ఒక్కరూ హోం ఐసోలేషన్ లోకి వెళ్లాలని కోరారు.