హెల్త్ వర్కర్లకు డబుల్ సాలరీ

హెల్త్ వర్కర్లకు డబుల్ సాలరీ

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ.. పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దాంతో హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా సరే దేశంలోని కొన్ని చోట్ల వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే వాటికి విభిన్నంగా హర్యానా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

తమ రాష్ట్రంలోని హెల్త్ సిబ్బందికి జీతాలు డబుల్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, గ్రూప్ 4 ఉద్యోగులు, అంబులెన్స్ డ్రైవర్లు, మరియు కరోనా పరీక్షా కేంద్రాలలో పనిచేసే సిబ్బందితో సహా.. హెల్త్ డిపార్ట్ మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి రెట్టింపు జీతం ఇస్తామని ఆయన తెలిపారు. ఈ జీతాలు కరోనా కంట్రోల్ లోకి వచ్చేవరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల హెల్త్ వర్కర్లను ప్రోత్సహించినట్లు అవతుందని… దాంతో వారు మరింత శ్రద్ధతో పనిచేస్తారని ఆయన అన్నారు. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తో చర్చించిన తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖట్టర్ తెలిపారు.

కరోనా నియంత్రణలో హెల్త్ వర్కర్ల కష్టాన్ని అర్థం చేసుకొని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్యానా కాంగ్రెస్ నాయకత్వం సమర్థించింది. హర్యానా సీఎం ఖట్టర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ… హర్యానా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా అభినందించారు. ‘వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య కార్యకర్తల వేతనం రెట్టింపు చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను అంగీకరించినందుకు చాలా కృతజ్ఞతలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

హెల్త్ సిబ్బంది జీతాలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. మరి మిగతా రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించి అమలు చేస్తాయో లేదో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది.

For More News..

రూ. 2 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వ రెండో ప్యాకేజి

కోహ్లీని రెచ్చగొడితే మరింత బాగా ఆడతాడు

ప్రమాదంలో దాదాపు 20 లక్షల జాబ్స్