పెండ్లి కానోళ్లకు పెన్షన్.. అప్లై చేద్దామనుకుంటున్నారా?

పెండ్లి కానోళ్లకు పెన్షన్.. అప్లై చేద్దామనుకుంటున్నారా?
  • త్వరలోనే కొత్త స్కీం తీసుకురానున్న హర్యానా సర్కారు

చండీగఢ్: పెండ్లి కాని వాళ్లకు పెన్షన్ ఇచ్చేందుకు హర్యానా సర్కారు రెడీ అయింది. అందుకు కొత్త పథకం తేనున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం కింద..  పెండ్లికాని 45 నుంచి 60 ఏండ్ల మధ్య వయసున్న ఆడ, మగవాళ్లకు పెన్షన్ ఇవ్వనుంది. ఈ పథకం అమలుపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఇటీవల సీఎం పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెండ్లికాని 60 ఏండ్ల వయసున్న ఓ మహిళ.. ఏ తోడూ లేని తనకు పెన్షన్ ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. 

దీనికి ఖట్టర్ సమాధానమిస్తూ పెండ్లికాకుండా ఉన్నవాళ్లకోసం త్వరలోనే పథకం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విధివిధానాలేంటనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు.