
- రాష్ట్రంలో ఆమె విగ్రహాన్ని నెలకొల్పాలి
- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, వెలుగు : మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి ధైర్యశాలి అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. సదాలక్ష్మి జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో టీఎన్ సదాలక్ష్మి 95వ జయంతిని నిర్వహించారు. దత్తాత్రేయ చీఫ్‌గెస్టుగా హాజరై ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో సదాలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. సదాలక్ష్మి కుమారుడు వంశీ తిలక్
జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ రాములు, చింతా సాంబమూర్తి, చీమ శ్రీనివాస్, ఇటిక్యాల రాజు మాట్లాడుతూ.. టీఎన్ సదాలక్ష్మి మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలందించారన్నారు. ప్రభుత్వం ఆమె విగ్రహాన్ని ధర్నా చౌక్, బొల్లారం, ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ రాణి కుముదిని, దాసరి బాలయ్య, ప్రొఫెసర్ తిరుపతి శంకర్, తదితరులు పాల్గొన్నారు.