స్వామినాథన్‌‌ మృతికి హర్యానా గవర్నర్‌‌‌‌ దత్తాత్రేయ సంతాపం

స్వామినాథన్‌‌ మృతికి హర్యానా గవర్నర్‌‌‌‌ దత్తాత్రేయ సంతాపం

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. స్వామినాథన్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు గురువారం హర్యానా రాజ్ భవన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆహార వృద్ధిలో దేశం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి.. దేశంలో ఎంతో మంది రైతుల జీవితాలను మార్చివేసిందని పేర్కొన్నారు.

సీపీఎం, సీపీఐ నేతల సంతాపం..

స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటని సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు అన్నారు. ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా చేసిన శాస్త్రవేత్తగా స్వామినాథన్‌‌ పేరు పొందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుర్తుచేశారు. స్వామినాథన్‌‌ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.