మంత్రిపై కరోనా వ్యాక్సిన్ 3వ దశ ట్రయల్స్

మంత్రిపై కరోనా వ్యాక్సిన్ 3వ దశ ట్రయల్స్

దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారు చేసిన కరోనా వైరస్ హ్యూమన్ ట్రయల్స్ మూడో దశ నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్  “కోవ్యాక్సిన్” చివరి హ్యూమన్ ట్రయల్స్ లో హర్యానా బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి అనీల్ విజ్ వాలంటీర్ గా పాల్గొన్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో నిర్వహించే కోవ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో 26వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు.  హర్యానాలోని కంటోన్మెంట్ టౌన్  అంబాల కాంట్ లో సైంటిస్ట్ లు నిర్వహిస్తున్న మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ ఆరోగ్యశాఖ మంత్రి 67ఏళ్ల అనిల్ విజ్ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.