
మసూద, బలగం సినిమాలతో టాలీవుడ్లో పాగా వేసింది కావ్య కల్యాణ్ రామ్(Kavya Kalyan Ram). హీరోయిన్లంతా స్లిమ్‌గా తయారయ్యేందుకు జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఈ బ్యూటీ మాత్రం ఆ మాత్రం బొద్దుగా లేకుంటే ఎలా అంటోంది. అయితే, కావ్య బాడీ షేమింగ్‌కు గురైందని ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది. అవకాశాల కోసం వెళ్తే కొందరు దర్శకులు బొద్దుగా ఉన్నావని రిజెక్ట్ చేసినట్టుగా కావ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా దీని సారాంశం.
ఇది వైరల్‌గా కావడంతో తాజాగా ఈ హీరోయిన్ ఈ వార్తలను ఖండించింది. తనను ఏ దర్శకుడూ బాడీషేమింగ్ చేయలేదని తెలిపింది. ఈ విషయాన్ని తాను ఏ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలాంటి వార్తలు సృష్టించేవారు అనవసర ప్రచారాలు మానుకోవాలని కోరింది.
ఇక చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో చాలా సినిమాలు చేసిన కావ్య కళ్యాణ్ రామ్.. మసూద(Masooda) సినిమాతో టాలీవడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కావ్య హీరోయిన్ గా చేసిన బలగం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు శ్రీసింహా తో ఉస్తాద్ సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా హిట్ అయితే.. కెరీర్ సార్టింగ్ లోనే హ్యాట్రిక్ హిట్స్ సాధించిన హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది కావ్య కళ్యాణ్ రామ్.