బంగారు తెలంగాణ కాదు.. బతుకే లేని తెలంగాణ చేశారు

బంగారు తెలంగాణ కాదు.. బతుకే లేని తెలంగాణ చేశారు

సంగారెడ్డి : ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ సదాశివపేట నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా..? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లుగా ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు పోడు పట్టాలు, 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చి.. ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలి అంటే హమాలి పని చేసుకో అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది బంగారు తెలంగాణ కాదు.. బతుకే లేని తెలంగాణ. ఇది బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. 

పేదవాడిని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ఆడింది ఆట.. పాడింది పాటగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఏ పథకం రూపొందించినా అది ప్రజల కోసమే చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అని, ఇప్పుడు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రేనా..? అని ప్రశ్నించారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా వైఎస్  షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.