కథ ప్రకారం పెద్ద బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనే తీయాలని స్టార్ట్ చేశాం

 కథ ప్రకారం పెద్ద బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనే తీయాలని స్టార్ట్ చేశాం

‘కాంబినేషన్స్‌‌‌‌‌‌‌‌ కాదు కథ నచ్చితేనే సినిమాలు చేస్తా’ అంటున్నారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. నలభై ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నలభై ఐదుకుపైగా సినిమాలు చేసిన ఆయన, సమంత లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో ‘యశోద’ చిత్రాన్ని నిర్మించారు. హరి, హరీష్ దర్శకులు. ఈ నెల 11న ఐదు భాషల్లో సినిమా విడుదలవుతున్న సందర్భంగా కృష్ణ ప్రసాద్ ఇలా ముచ్చటించారు. ఈ సినిమా వెనుక మా అంకుల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన చనిపోయినప్పుడు చరణ్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా చెన్నైలో ఉన్నాను. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే ఈ స్టోరీ విన్నా.  నా సలహాలు అడిగితే కొన్ని చెప్పా. తర్వాత ఆ నిర్మాత తప్పుకోవడంతో తిరిగి నా దగ్గరకు వచ్చింది.

కొత్త దర్శకులు కావడంతో లిమిటెడ్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో చేయాలనుకున్నారు. కథ ప్రకారం పెద్ద బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనే తీయాలని స్టార్ట్ చేశాం. ‘ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌‌‌‌‌ 2’ చూసి సమంతను సంప్రదించాం. వెంటనే ఓకే చెప్పారామె.  ‘శాకుంతలం’ షూట్ కూడా పూర్తి కావడంతో ఫోకస్ మొత్తం ఈ సినిమాపై పెట్టారు. డబ్బింగ్ చెప్పే టైమ్‌‌‌‌‌‌‌‌లోనే మాకు ఆమె హెల్త్ కండిషన్‌‌‌‌‌‌‌‌ గురించి తెలిసింది. అయినా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తమిళంలో డబ్బింగ్ చెప్పే టైమ్‌‌‌‌‌‌‌‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పిద్దామన్నాను. తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసని డాక్టర్‌‌‌‌‌‌‌‌ను  దగ్గర పెట్టుకుని ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డెడికేషన్‌‌‌‌‌‌‌‌కు హ్యాట్సాఫ్. సరోగసీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న క్రైమ్‌‌‌‌‌‌‌‌ని ఇందులో చూపించాం. ఇది ఎక్స్‌‌‌‌‌‌‌‌పెరిమెంట్ అనుకుని చేయలేదు.. ఎగ్జైట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో చేశా. ‘ఆదిత్య 369’ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ విషయంలో ఎలా ఎగ్జైట్‌‌‌‌‌‌‌‌ అయ్యానో అదే ఆసక్తి ఈ సినిమా విషయంలోనూ ఫీలయ్యా. ప్రేక్షకులు చూస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. బాలకృష్ణ గారితో స్వీట్ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఇటీవల కలిస్తే ఈ సినిమా గురించి అడిగారు. ఆయన ఇమేజ్, నా అభిరుచికి తగ్గ కథ ఎవరైనా తీసుకొస్తే సినిమా చేయాలని నాకూ ఉంది.