
ఇవి రాళ్లో రప్పలో.. బొగ్గు ముద్దో కాదు!! ఊపిరితిత్తులు. దీని వెనక మెయిన్ విలన్ సిగరెట్ తాగడమే. సినిమా థియేటర్లలో అదేదో పిండి నల్లటి లిక్విడ్‌ను తీయడం చూపిస్తారు కదా. ఈ ఊపిరితిత్తులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. చైనాలోని జియాంగ్సూకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల పాటు రోజూ పెట్టె సిగరెట్లు కాల్చడం వల్ల ఊపిరితిత్తులు ఇలా నల్లగా మారిపోయాయట. ఆ వ్యక్తికి ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రోగాలు వచ్చి చనిపోయాడని జియాంగ్సూలోని వూషి పీపుల్స్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేసి ఆ ఊపిరితిత్తులను బయటకు తీశారు. ఆ వీడియోను.. ‘ఇప్పటికీ మీకు సిగరెట్ తాగే ధైర్యం ఉందా?’ అన్న క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పెట్టింది ఆ ఆస్పత్రి. 2.5 కోట్ల మందికి పైగా ఆ వీడియోను చూశారు. చనిపోయాక తన అవయవాలను దానం చేయాలని ఆ వ్యక్తి చెప్పడంతో, డాక్టర్లు వాటిని తీసేందుకు ఆపరేషన్ చేశారు. అయితే, నల్లగా మారిన ఊపిరితిత్తులను చూశాక, అతడి శరీరంలోని అవయవాలేవీ పనికిరావని తేల్చేశారు. చనిపోయిన వ్యక్తి లంగ్ పల్మొనరీ ఎంఫీసెమాతో బాధపడ్డాడని చైనాకు చెందిన నేషనల్ హార్ట్ అండ్ లంగ్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ పీటర్ ఒపెన్షా చెప్పారు. దాని ప్రభావం వల్ల శరీరంలోని అవయవాలు బాగా ఉబ్బిపోయాయన్నారు. లంగ్స్‌ను తీసేముందు వాటిలోకి గాలి లేదా సెలైన్ ద్రావణాన్ని నింపి ఉంటారని, అందుకే అవి ఇంత పెద్దగా అయ్యాయని చెప్పారు. చూశారుగా.. సిగరెట్ ఎఫెక్ట్ లంగ్స్పై ఎంతలా పడుతుందో!! ఇది చూశాక కూడా.. ఇంకా సిగరెట్ తాగే ధైర్యం ఉందా?