సంపూర్ణ సూర్యగ్రహణం ఇండియాలో ఎప్పుడో తెలుసా?

సంపూర్ణ సూర్యగ్రహణం ఇండియాలో ఎప్పుడో తెలుసా?

ఉత్తర అమెరికాను సంపూర్ణ సూర్యగ్రహణం సోమవారం (ఏప్రిల్ 8)  ఏర్పడిన విషయం తెలిసిందే. సూర్యగ్రహణ ప్రభావంతో మెక్సికో, అమెరికా, కెనడాలోని నగరాలు పగటిపూటే అంధకారంలో మునిగిపోయాయి. సూర్యగ్రహణం మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ని మజత్లాన్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 11:37 గంటలకు సూర్యగ్రహణం ఏర్పడింది. గతం కంటే ఈసారి సూర్యగ్రహణం మొత్తం 4 నిమిషాల 28 సెకనులు ఏర్పడింది. గతంకంటే ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని 3.6 మిలియన్ల ప్రజలు ప్రతక్ష్యంగా చూశారు.2017 తర్వాత ఉత్తర అమెరికాకు ఇది తొలి సంపూర్ణ గ్రహణం. అయితే భారత్ లో సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు.. ఏయే ప్రాంతాల్లో ఉంటుంది.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం.. 

అయితే ఈసారి భారతదేశంలో సంపూర్ణ గ్రహణం లేదు. భారత్ లో రింగ్ ఆఫ్ ఫైర్ ను చూడడానికి మరో 6 సంవత్సరాలు వేచి చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2031 మే 21న దేశవ్యాప్తంగా అనేక నగరాల నుంచి ముఖ్యంగా కేరళ, తమిళనాడులలో సంపూర్ణ సూగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.