కమల్-మణిరత్నం థగ్ లైఫ్ వెనుకున్న.. థియరీ గమనించారా!

 కమల్-మణిరత్నం థగ్ లైఫ్ వెనుకున్న.. థియరీ గమనించారా!

36 ఏళ్ల తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) - దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) థగ్ లైఫ్ అనే మూవీతో వస్తోన్నారు. ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయగా..భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ లో కమల్ తన పాత్ర పేరు చెబుతూ..ఒక‌టికి రెండుమార్లు నొక్కి మరి చెప్పిన విధానం అంద‌రి ఆలోచింపజేస్తుంది. దీంతో థగ్ లైఫ్ మూవీ వెనుకున్న థీమ్ చెప్పేసినట్టు తెలుస్తోంది. 

థగ్ లైఫ్ లో కమల్ క్యారెక్టర్ పేరు రంగ‌రాజ‌న్ శ‌క్తివేల్ నాయ‌క‌ర్..ఇదీ క‌మ‌ల్ పాత్ర పేరు. ఇందులో శ‌క్తివేల్ అన్న‌ది 36 ఏళ్ల కిందటి నాయ‌క‌న్ మూవీలో క‌మ‌ల్ మ‌న‌వ‌డి పేరు. ఒక సీన్లో మ‌న‌వ‌డిని పేరెంటో అడిగి తెలుసుకుని..త‌న పేరు క‌లిసి వ‌చ్చేలాగే అత‌డికి పేరు పెట్టాడ‌ని తెలియగానే..ఆ సీన్ లో చాలా ఎమోష‌న‌ల్ అవుతాడు క‌మ‌ల్. 

లేటెస్ట్ గా థగ్ లైఫ్ లో శ‌క్తివేల్ నాయ‌క‌ర్ అనే పేరుతో క‌మ‌ల్ పాత్ర వ‌స్తుండ‌టంతో..ఇక ఆడియన్స్ కి మణిరత్నం ఓ క్లారిటీ ఇచ్చేసాడని తెలుస్తోంది. నాయ‌కుడు సినిమాలోని పెద్దాయన మ‌న‌వ‌డే..ఇందులో హీరో అనే సంకేతాలు వినిపిస్తోన్నాయి. అదే కనుక నిజమైతే  మరో కల్ట్ క్లాసిక్ రిపీట్ అవ్వడం ఖాయం.

అంతేకాకుండా డైరెక్టర్ మణిరత్నం మరో సినిమాకి కూడా లింక్ పెట్టేశాడు. క‌మ‌ల్ పేరులో రంగ‌రాజ‌న్ అని ఉండ‌డంతో..ద‌శావ‌తారం మూవీ స్టార్టింగ్ లో వచ్చే పాత్ర‌తో ఈ సినిమాకు లింక్ ఉందేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ..థగ్ లైఫ్ టీజర్ మరో లెవెల్ లో ఉంది. మణిరత్నం టేకింగ్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజన్స్, ఏ ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. 

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, హీరో ఉదయ్ నిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది.