ఎలుక ఫొటోలకి పోజులివ్వడం చూశారా!

ఎలుక ఫొటోలకి పోజులివ్వడం చూశారా!

బర్త్​ డేలకి, పెండ్లిండ్లకి.. మరికొన్ని స్పెషల్​ అకేషన్స్​కి మనలో చాలామంది ఫొటోషూట్లు  చేయించుకుంటారు. కానీ, ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒక ఎలుక ఫొటోలకి పోజులివ్వడం చూశారా! అయితే ఈ ఫొటోలోని ఎలుక గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. బ్యూటెంగెబిడెన్ అనే ట్విట్టర్​ యూజర్​ ఈ చిట్టెలుక వీడియోని షేర్​ చేశాడు. ఇరవై రెండు సెకన్లు ఉన్న ఈ వీడియోలో..ఫేమస్​ వైల్డ్​లైఫ్​​ ఫొటోగ్రాఫర్​ జూలియన్​ ర్యాడ్ కెమెరాతో ఫొటోలు తీస్తుంటాడు. ఆ శబ్దం విని కలుగులో దాక్కున్న చిట్టెలుక బయటికి వస్తుంది. అది గమనించిన జూలియన్​.. దానికి ఒక పువ్వు ఇస్తాడు. వెంటనే దాన్ని అందుకుని ఫొటోలకి పోజులిచ్చింది. ఆ పువ్వుని తింటూ.. అది ఇచ్చిన పోజులు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఈ వీడియోని ఇప్పటికే యాభై లక్షల మందికి పైగా చూశారు. లక్షల్లో లైకులు వచ్చాయి. ఈ ఫొటో షూట్​ చేసిన జూలియన్​ని తెగ మెచ్చుకుంటున్నారు.