
హైదరాబాద్, వెలుగు: ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చెందిన వాణిజ్య వాహనాల తయారీ సంస్థతో తన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకుని, విస్తరించుకుంది. క్లయింట్ పేరు, ఒప్పంద విలువను వెల్లడించలేదు. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్‌సీఎల్‌టెక్ తన ఏఐ ఫోర్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి స్వీడిష్ ఆటోమోటివ్ సంస్థ ఐటీ మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తుంది. ఈ ఒప్పందంలో ప్లాట్‌ఫారమ్ ఆధారిత నిర్వహణ సేవలు, హైపర్-ఆటోమేషన్, పూర్తి స్థాయి అబ్జర్వబిలిటీ వంటివి ఉన్నాయి. ఇవి ఐటీ సేవల సామర్థ్యాన్ని పెంచుతాయని, ఉద్యోగులు ఇంకా కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తాయని హెచ్‌సీఎల్‌టెక్ తెలిపింది.