ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం

ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం

ఇంటర్నెట్ డేటా కోసం ఇవ్వనున్న హెచ్ సీయూ
ఈ నెల 20 నుంచి క్లాసులు స్టార్ట్

హైదరాబాద్, వెలుగు: కరోనా నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ క్లాసుల కోసం ప్రైవేటు విద్యాసంస్థలు స్టూడెంట్ల నుంచే ఫీజులు వసూలు చేస్తుండగా… హెచ్ సీయూ మాత్రం క్లాసులు వినేందుకు స్టూడెంట్లకే ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది. డిజిటల్ యాక్సెస్ గ్రాంట్ (డీఏజీ) కింద పేద విద్యార్థులందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని వర్సిటీ డెసిషన్ తీసుకుంది. కరోనా ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై సీనియర్ ప్రొఫెసర్ వినోద్ పవరాలా నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. ఆ కమిటీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీనుంచి మెయిల్స్ద్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకుంది. ఆ రిపోర్టును వీసీ అప్పారావుకు అందజేసింది. ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని, ఇంటర్నెట్ డేటా కోసం పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందజేయాలని కమిటీ సిఫారసు చేసింది. దీనిపై వీసీ గురువారం డిపార్ట్మెంట్ హెడ్స్, డీన్స్ తో చర్చించి ఆమోదంతెలిపారు. దీంతో ఈ నెల 20 నుంచి సుమారు 2వేల మంది స్టూడెంట్లకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.

బీబీఎల్ స్టూడెంట్ల కు డీఏజీ…
బోర్డింగ్ అలవెన్స్ సౌకర్యం (బీబీఎల్) పొందుతున్న స్టూడెంట్లకు డిజిటల్ యాక్సెస్ గ్రాంట్( డీఏజీ) కింద నెలకు రూ.వెయ్యి అందించనున్నారు. దీని ద్వారా ఆన్లైన్ బోధన సమర్థవంతంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకు లైవ్ క్లాసులు చెప్పకుండా ప్రీ రికార్డెడ్ క్లాసులు నిర్వహించాలని లెక్చరర్లకు సూచించారు. స్టూడెంట్లు వెంటనే సెమిస్టర్ రిజిస్ర్టేషన్ చేసుకోవాలని ఆదేశించారు. అయితే ఇందుకు వెంటనే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, దీంతో విద్యార్థులపై ఆర్థిక భారం పడదని అంటున్నారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్రతి ఫ్యాకల్టీకి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ దీని ద్వారా పాఠాలు ఎప్పుడైనా వినే అవకాశం కల్పిస్తున్నారు. నెల రోజుల తర్వాత ఆన్లైన్ క్లాసులపై టాస్క్ ఫోర్స్ కమిటీ రివ్యూ చేసి, ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తుంది.

For More News..

1,412 బడుల్లో పిల్లలే లేరు

ప్రైవేటు స్కూల్స్ ఫీజులు దోచుకుంటుంటే సర్కార్‌ ఏం చేస్తోంది?