కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించిన దేవెగౌడ

కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించిన దేవెగౌడ

హైద‌రాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేతకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ సీఎం పోరాటానికి సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నామని ప్రకటించారు. కేసీఆర్కు ఫోన్ చేసిన దేవెగౌడ దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ అభినందించారు. 

"రావు సాబ్.. మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. పెద్ద యుద్దమే చేస్తున్నారు.. మతతత్వ శక్తుల మీద పోరాటాన్ని కొనసాగించాల్సిందే. లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేము మీకు అండగా వుంటాం.. మీ యుద్దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది." అంటూ దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా తాను త్వరలోనే బెంగళూరు వచ్చి కలుస్తానని సీఎం కేసీఆర్, దేవెగౌడకు చెప్పారు.