హెచ్‌‌డీఎఫ్‌‌సీ రూ.25 వేల మినిమమ్‌‌ బ్యాలెన్స్‌‌ వార్తలపై క్లారిటీ..

హెచ్‌‌డీఎఫ్‌‌సీ రూ.25 వేల మినిమమ్‌‌ బ్యాలెన్స్‌‌ వార్తలపై క్లారిటీ..

న్యూఢిల్లీ: రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాకు రూ. 10 వేల మినిమమ్ బ్యాలెన్స్ నియమం ఉందని,  సేవింగ్స్‌‌ మ్యాక్స్ ఖాతాకు మాత్రమే తాజాగా ఈ అమౌంట్‌‌ను రూ.25 వేలకు పెంచామని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ గురువారం వివరణ ఇచ్చింది.   వివిధ కస్టమర్ ప్రొఫైల్‌‌లకు అనుగుణంగా వేరు వేరు  సేవింగ్స్ అకౌంట్‌‌ వేరియంట్‌‌లను అందిస్తున్నామని తెలిపింది. 

అకౌంట్ బట్టి కస్టమర్ మెయింటైన్ చేయాల్సిన నెలవారీ మినిమమ్‌‌ బ్యాలెన్స్ మారుతుందని పేర్కొంది.  గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో బ్రాంచ్‌‌లలో రెగ్యులర్‌‌‌‌, మ్యాక్స్ సేవింగ్స్ అకౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మెట్రో బ్రాంచ్‌‌లలో కొత్త ఖాతాలకు సేవింగ్స్ మ్యాక్స్ ఖాతాను ప్రాధాన్యంగా అందిస్తారు.