వ్యాపారుల అవసరాలను  తీర్చేందుకు ‘స్మార్ట్‌‌హబ్‌‌ వ్యాపార్‌‌’

వ్యాపారుల అవసరాలను  తీర్చేందుకు ‘స్మార్ట్‌‌హబ్‌‌ వ్యాపార్‌‌’

హైదరాబాద్‌‌, వెలుగు: వ్యాపారుల బిజినెస్‌‌ అవసరాలను  తీర్చేందుకు ‘స్మార్ట్‌‌హబ్‌‌ వ్యాపార్‌‌’ ‌‌మర్చంట్‌‌ యాప్‌‌ను హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ గురువారం లాంచ్ చేసింది.  బ్యాంక్  కస్టమర్లయిన వ్యాపారులు ఎటువంటి పేపర్లు సబ్మిట్ చేయకుండానే ఇన్‌‌స్టంట్‌‌గా, ఆన్‌‌లైన్‌‌లోనే ఈ యాప్‌‌లో రిజిస్టర్ అవ్వడానికి వీలుంటుంది.  అంతేకాకుండా ఈ యాప్ ద్వారా వ్యాపారులు కార్డులు, యూపీఐ, క్యూఆర్ కోడ్ వంటి వివిధ మార్గాల ద్వారా పేమెంట్స్‌‌ను పొందొచ్చని  హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌  ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.

వ్యాపారులు ఎస్‌‌ఎంఎస్ లేదా ఈమెయిల్‌‌ ద్వారా లింక్‌‌లు పంపి కూడా రిమోట్‌‌ పేమెంట్స్ అందుకోవచ్చని  వివరించింది.  యూపీఐ ద్వారా  వచ్చే పేమెంట్స్ వెంటనే వ్యాపారుల అకౌంట్‌‌లలో క్రెడిట్ అవుతాయని, మర్చంట్లు వెంటనే సేల్స్ రిసీట్‌‌ను పొందడానికి ఈ యాప్ ద్వారా వీలుంటుందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ పేర్కొంది. ఇంకా పేమెంట్‌‌లకు సంబంధించిన విషయాలు చెప్పేందుకు స్మార్ట్‌‌హబ్‌‌ వ్యాపార్ యాప్‌‌లో ఇన్‌‌బిల్ట్‌‌గా వాయిస్ ఫీచర్‌‌‌‌ను యాడ్ చేశామని తెలిపింది.

వ్యాపారులు పిక్స్డ్‌‌ డిపాజిట్లను ఓపెన్ చేయడం, ప్రీ–అప్రూవ్డ్ లోన్లను, క్రెడిట్ కార్డులను  యాక్సెస్ చేసుకోవడం వంటి బ్యాంకింగ్ సర్వీస్‌‌లు కూడా పొందొచ్చు.  మర్చంట్లు తమ డిస్ట్రిబ్యూటర్లకు, వెండర్లకు కూడా ఈ యాప్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యుటిలిటీ బిల్లులు, జీఎస్‌‌టీ వంటి పేమెంట్లు జరుపుకోవచ్చు.