న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (హెచ్డీబీఎఫ్ఎస్) ఐపీఓను ప్రారంభించడానికి దాని డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయంగా ఆమోదించినట్లు ప్రకటించింది. ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు సేకరించే అవకాశం ఉంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను తప్పనిసరిగా పబ్లిక్ కంపెనీలుగా మార్చాలని ఆర్బీఐ ఆదేశించడంతో హెచ్డీఎఫ్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే కేఆర్ఎన్ హీట్ ఎక్స్‌ఛేంజర్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ తన రూ. 342 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం ప్రైస్ బ్యాండ్‌ను రూ. 209–రూ. 220 మధ్య నిర్ణయించింది. రాజస్థాన్‌కు చెందిన ఈ కంపెనీ ప్రారంభ వాటా విక్రయం సెప్టెంబర్ 25న మొదలై సెప్టెంబర్ 27న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం వేలం సెప్టెంబర్ 24న ఉంటుంది.