
న్యూఢిల్లీ: మాజీ లెఫ్టాండర్ గౌతం గంభీర్ బ్యాట్స్‌మన్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. టీ20 వరల్డ్‌కప్‌తోపాటు వన్డే వరల్డ్‌కప్‌ను టీమిండియా ఒడిసి పట్టడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియాకు కొన్ని మ్యాచుల్లో గంభీర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సారథిగా సక్సెస్ అయ్యాడు. ఈ వెటరన్ క్రికెటర్ పై మరో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంభీర్ మరి కొంత కాలం కెప్టెన్‌గా సేవలు అందించాల్సిందని పఠాన్ చెప్పాడు. అతడు మంచి కెప్టెన్ అయ్యేవాడన్నాడు.
‘కెప్టెన్స్‌గా సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేపై నాకు చాలా గౌరవం ఉంది. అయితే గౌతం గంభీర్ టీమిండియాను మరిన్ని మ్యాచుల్లో ముందుండి నడిపించాల్సింది. అతడు మంచి సారథి అయ్యేవాడు. నేను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను కూడా ఇష్టపడతా. కానీ దానర్థం నేను ఎంఎస్ ధోనీని ఇష్టపడనని కాదు’ అని పఠాన్ చెప్పాడు. 2010లో న్యూజిలాండ్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌ల్ గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌ను మెన్ ఇన్ బ్లూ 5–0 క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్‌లో 329 రన్స్ చేసిన గంభీర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 2011లో వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్‌కు కెప్టెన్సీ చేపట్టి జట్టుకు విజయం అందించాడు.