వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్

వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ అగర్వాల్, రవితేజ కలిసి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. టైటిల్‌‌కు తగ్గట్టే నెగిటివ్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించాడు రవితేజ. వరుస హత్యలు చేస్తున్న అతని కోసం పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు లాయర్‌‌‌‌గా ఫరియాతో కలిసి కనిపించాడు రవితేజ. అతను ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు.. ఇందులో సుశాంత్ క్యారెక్టర్ ఏమిటనేది సస్పెన్స్. ఇక చివర్లో జోకర్‌‌‌‌ పాత్రను, రవితేజను ఒకే ఫ్రేమ్‌‌లో చూపించడాన్ని బట్టి.. లోపల ఎంత బాధ ఉన్న పైకి నవ్వుతూ కనిపించేలా తన క్యారెక్టర్ ఉండబోతోందని అర్థమవుతోంది.

క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ కూడా కనిపిస్తోంది. ‘వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్’.. మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. నేను ఆర్టిస్ట్ ను’... అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ఇంప్రెస్ చేసింది. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్,  పూజిత పొన్నాడ హీరోయిన్స్‌‌గా నటించారు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది.