ఫ్లోరిడాలో గెలిచినోళ్లే  ప్రెసిడెంట్​ అవుతారట ​

ఫ్లోరిడాలో గెలిచినోళ్లే  ప్రెసిడెంట్​ అవుతారట ​

ఇక్కడ గెలిచినోళ్లే  ప్రెసిడెంట్​ అవుతారని సెంటిమెంట్​

ఫ్లోరిడాలో మళ్లీ గెలిచిన  ట్రంప్​

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఖరారు చేసే కీలక స్వింగ్​ రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో ఈసారి కూడా డొనాల్డ్​ ట్రంప్​ విజయం సాధించారు. ఇక్కడి 29 ఎలక్టోరల్​ కాలేజ్​ ఓట్లను ఆయన దక్కించుకున్నారు. 21.5 మిలియన్​ జనాభా ఉన్న ఫ్లోరిడా రాష్ట్రంలో 54 % మంది తెల్లజాతీయులు, 26% మంది హిస్పానిక్ జాతీయులు, 16% అఫ్రికన్​ అమెరికన్స్, 3% ఏసియన్​ అమెరికన్స్​ ఉంటారు. ఈ రాష్ట్రంలో  గెలిచిన వారు  ప్రెసిడెంట్​ అవుతారన్న  సెంటిమెంట్​ ఉంది. ఇక్కడ డెమొక్రాట్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్​ గెలుస్తారని మొదట్లో ప్రీ పోల్స్​, మీడియా అంచనా వేసింది. ఈ కీలక రాష్ట్రంలో చివరి నిమిషంలో ట్రంప్​ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. తుది ఫలితాలు ఆయనకే అనుకూలంగా వచ్చాయి. 2016లో జరిగిన ఎన్నికల్లోనూ డెమొక్రాట్​ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్​ ఫ్లోరిడాలో విజయం సాధిస్తారని సర్వేల్లో తేలినా.. చివరికి ట్రంప్ గెలిచారు.

2004 నుంచి ఫలితాలు ఇలా

ఇయర్​   విజేత       పార్టీ

2004     బుష్​         రిపబ్లికన్​

2008     ఒబామా   డెమొక్రాట్​​

2012     ఒబామా   డెమొక్రాట్​

2016     ట్రంప్​        రిపబ్లికన్​

2020     ట్రంప్​        రిపబ్లికన్​