పాఠ్య పుస్తకాలను హెడ్మాస్టర్, టీచర్లు కలిసి అమ్ముకున్నారు

పాఠ్య పుస్తకాలను హెడ్మాస్టర్, టీచర్లు కలిసి అమ్ముకున్నారు

లింగంపేట, వెలుగు: స్కూల్​ టీచర్లతో కలిసి హెడ్మాస్టర్​ అక్రమంగా పాఠ్య పుస్తకాలను విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు జడ్పీ హైస్కూల్​లో ఆలస్యంగా వెలుగుచూసింది. నల్లమడుగు జడ్పీ హైస్కూల్​ కాంప్లెక్స్​హెడ్మాస్టర్​గా కృష్ణమోహన్​15 రోజుల క్రితం బాధ్యతలు చేపట్టాడు. స్కూల్ ​పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను ఈ నెల 19న గుట్టుచప్పుడు కాకుండా విక్రయించాడు. విషయం సోషల్​మీడియాలో వైరలైంది.

నెల రోజులుగా కురిసిన వానలకు పుస్తకాలు తడిసి చెదలు పట్టాయని, గదిలో పాములు వస్తున్నాయని, పిల్లలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో బుక్స్​ అమ్మినట్లు ఎస్​ఎంసీ తీర్మానంలో పేర్కొన్నారు. తమకు తెలియకుండానే పాఠ్య పుస్తకాలను హెడ్మాస్టర్, టీచర్లు కలిసి అమ్ముకున్నారని ఎస్ఎంసీ చైర్మన్​ సిద్దవ్వ, వైస్​ చైర్మన్ ​మోతీరాం, పేరేంట్స్​ ఆరోపించారు. పుస్తకాలు అమ్మగా రూ.2,800 వచ్చాయని, విషయాన్ని  జిల్లా విద్యాశాఖ అధికారికి  వివరించినట్లు హెడ్మాస్టర్​ చెప్పారు.