కుంటాల, వెలుగు: హిందువులు ఆధ్యాత్మికతను అలవర్చుకొని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని కర్ణాటక హంపీ పిఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి సూచించారు. ఆదివారం నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(బి) గ్రామంలో గురుదత్త సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన మాఘ పౌర్ణమ దత్త యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్నారు.
పురాతన దేవాలయాల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు, దైవ సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్న గ్రామస్తుల ఐక్యతను అభినందించారు. దత్త హోమంలో పాల్గొన్న జంటలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో గురు దత్త సేవా సమితి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
