నాలుక కాలినా, పూసినా ఇలా చేస్తే.. రెండు రోజుల్లో రిలీఫ్

నాలుక కాలినా, పూసినా ఇలా చేస్తే.. రెండు రోజుల్లో రిలీఫ్

నాలుక.. మీరు తినే ఆహారం ఎలా ఉంది అనే చెప్పేది.. బాగుందా లేదా అని డిసైడ్ చేస్తుంది. కొన్ని సార్లు నాలుక పూస్తుంది.. వేడి వేడి పదార్థాలు నోట్లో పడినప్పుడు నాలుగు కాలుతుంది.. దీని వల్ల సరైన ఆహారం తీసుకోలేరు.. తీసుకునే ఆహారం రుచి తెలియదు. అన్నింటి కంటే ముఖ్యంగా చిరాకు ఉంటుంది. ఈ క్రమంలోనే నాలుక కాలినా, నోరు పూసినా వెంటనే దాని నుంచి బయటకు రావటం అనేది చాలా ముఖ్యం. దీని కోసం మన వంటింట్లోని చిట్కాలతో వెంటనే నయం చేసుకోవచ్చు.. రెండు రోజుల్లో నయం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

చల్లని పదార్థాలు తీసుకోవాలి :

నాలుక కాలిన వెంటనే చల్లని నీళ్లు తాగాలి. దీని వల్ల వేడి తీవ్రత తగ్గుతుంది. ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు చల్లని నీటిని తీసుకోవటం వల్ల వేడి నుంచి తక్షణమే ఉపసమనం పొందొచ్చు.  

పసుపుతో పేస్ట్ చేసుకోవాలి :

కొంచెం పాలు, కొంచెం తేను, కొంచెం పసుపు తీసుకుని.. దాన్ని పేస్టుతో తయారు చేసుకోవాలి. ఆ పేస్టును.. నాలుకపై చేతితో అప్లయ్ చేసుకోవాలి. అలా 10 నిమిషాలు ఉన్న తర్వాత.. నోటిని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కాలిన నాలుక మంట నుంచి రిలాక్స్ లభిస్తుంది. త్వరగా తగ్గిపోవటానికి ఉపయోగం పడుతుంది. గాయం పెద్దది కాకుండా రక్షిస్తుంది. 

ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి :

గోరు వెచ్చని నీటిలో ఉప్పు చేసుకుని.. ఆ నీరు చల్లారిన తర్వాత రెండు, మూడు సార్లు నోటిని పుక్కిలించాలి. దీని వల్ల కాలిన నాలుకపై ఉంటే బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే పోతాయి. గాయం పెద్దది కాకుండా ఈ విధానం రక్షిస్తుంది. ఉప్పులో ఉండే సహజ క్రిమినాశకాలు మీ నోటిని త్వరగా సాధారణ స్థితికి తీసుకురావటానికి సహాయం చేస్తుంది. 

అలాంటి ఆహారం నుంచి దూరంగా ఉండాలి :

నాలుక కాలినా, పూసిన తర్వాత కొన్ని రోజులు స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. అదే విధంగా లిక్కర్, మందు తాగొద్దు. మాసాలా ఆహారాలు తీసుకోవద్దు. మసాలా, లిక్కర్, కారంలో ఉండే రసాయనాలు.. మీ నాలుకను మరింత ఇబ్బందిగా మారుస్తున్నాయి. సో.. ఇలాంటి టైంలో పూర్తి నయం అయ్యే వరకు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవటమే బెటర్. 

పాలు, పెరుగు బెటర్ :

పెరుగును ఎక్కువగా తీసుకోవటంతోపాటు.. చల్లారిన పాలను తాగటం వల్ల అందులోని పదార్థాలు మీ నాలుకను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొస్తాయి. ఇలాంటి సమయంలో చల్లని పెరుగు తీసుకోవటం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తెలిసింది కదండీ.. నోరు పూసినా, కాలినా భయపడకుండా.. ఆందోళన చెందకుండా.. చిరాకు పడకుండా ఈ చిట్కాలు పాటిస్తే.. రెండు రోజుల్లో రిలీఫ్ వస్తుంది. బీ హ్యాపీ.. బీ హెల్తీ..