చలికాలం ఎక్కువగా లభించే పండ్లలో ఉసిరి ఒకటి. రుచి కాస్త వగరుగా ఉండడం వల్ల వీటిని చాలా తక్కువగా తింటారు. అయితే ఉసిరిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాల్ని పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .
- ఉసిరి కాయలను నేరుగా తినొచ్చు. లేదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఇక ఉసిరితో పచ్చడి పెట్టుకున్నా మంచిది. చర్మం, జుట్టు సంరక్షణలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
- పలు షాంపులు, ఆయిల్స్ లో ఉసిరిలోని సారాన్ని కలుపుతుంటారు. ఉసిరిని తినడం వల్ల చర్మం ముడతలు తగ్గిపోయి, కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు కూడా దృఢంగా ఉంటూ మెరుస్తుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది.
- ఉసిరి రసాన్ని ముఖానికి రాసుకుని, అరగంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. చర్మ సమస్యలు ఉన్నవారు నీటిలో ఈ రసాన్ని కలుపుకొని వాడుకోవాలి.
- ఉసిరికాయల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఐదు నిమిషాల అనంతరం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఉసిరిలోని విటమిన్ సి.... యాంటీ ఆక్సిడెంట్లు మృతకణాల్ని తొలగిస్తాయి.
- ఎండు ఉసిరిని నీటిలో వేసి కొద్దిసేపు ఉడకబెట్టండి. అనంతరం దీన్ని ఓ మిశ్రమంలా తయారు చేయండి. మెత్తగా పేస్టులా మారిన తర్వాత తలకు పట్టించండి. ఇలా వారినికోసారి చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఉసిరి రసాన్ని తలకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.
