Health Alert: స్మార్ట్ ఫోన్ ఎక్కువుగా వాడుతున్నారా.. వేళ్లు బిగుసుకుపోతాయి.. తస్మాత్ జాగ్రత్త..!

Health Alert:  స్మార్ట్ ఫోన్ ఎక్కువుగా వాడుతున్నారా.. వేళ్లు బిగుసుకుపోతాయి.. తస్మాత్ జాగ్రత్త..!

జనాలకు ఫోన్​ నిత్యావసరం అయింది. పని ఉన్నా.. లేకపోయినా ఫోన్​ చేతిలో ఉండాల్సిందే.. ఇక ఖాళీగా ఉంటామా.. స్మార్ట్​ ఫోన్​ ఆన్​ చేయడం... జీవితం దానితోనే  అన్నవిధంగా తయారయింది.  ఇదే ఓ అమ్మాయి చేతివేళ్లను బిగుసుకొనేలా చేసింది. అతిగా ఫోన్​ వాడకం.. మెదడుకే కాదు.. చేతి వేళ్లకు కూడా చాలా ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుం దని నిపుణులు చెబుతున్నా వినకుండా చాలా మంది. ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ మధ్య ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కామన్ అయిపో యింది. 

చాలామంది ఫోన్ లేకుండా ఉండలేక పోతున్నారు. ఇలాంటి అలవాటే ఓ అమ్మాయి కి పెద్ద సమస్య తెచ్చి పెట్టింది. చైనాలో ఓ యువతి స్మార్ట్​ ఫోన్​ విడవకుండా పట్టుకుని ఉండడంతో చేతి వేళ్లు బిగుసుకుపోయాయి. ఫోన్​ ను  పట్టుకున్న స్థితిలోనే ఫ్రీజ్ అయ్యాయి. వైద్యులు ట్రీట్ మెంట్ చేసి చివరికి మామూలు స్థితికి తీసు కొచ్చారు. 

"మేమూ ప్రతి రోజు ఫోన్ ఉపయోగిస్తున్నాం మరి ఆమెకే ఇలా ఎందుకు జరిగింది' అనుకుంటున్నారా...! ఆమె అందరి కన్నా కాస్త ఎక్కువగా ఉపయోగిస్తుందట స్మార్ట్​ ఫోన్​ను.   తన ఉద్యోగానికి వారం సెలవు పెట్టి మరీ ఫోన్​ కు  అతు క్కుపోయింది. అలా వాడుతున్నప్పుడు ఆమె చేతులకు నొప్పి వచ్చింది అయినా విడువకుండా ఫోన్​ ను  అలాగే ఉపయోగించింది. దాంతో చేతులు బిగుసుకుపో యాయి. ఇలా అతిగా ఫోన్ వాడేవాళ్లుంటే జాగ్రత్త.  మరి మీరు కూడా అతిగా స్మార్ట్​ ఫోన్​ వాడుతున్నారా.. బీ కేర్​ ఫుర్​..!