
బొప్పాయి పండులో ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇది తినడానికి రుచిగానే కాదు..కొన్ని రకాల రోగాలకు మంచి ఔషధంగాను ఉపయోగపడుతుంది. బొప్పాయిలో… విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గినవారు బొప్పాయి ఆకుల రసాన్ని జ్యూస్ చేసుకొని తాగితే మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం డెంగీ జ్వరాలు ప్రబలుతుండటంతో బొప్పాయి ఆకుల జ్యూస్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.
బొప్పాయితో ప్రయోజనాలు:
భోజనం చేసాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు
రోజూ తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది
కొవ్వు పదార్థాల ద్వారా ఏర్పడే సమస్యలను నివారిస్తుంది
గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది
క్యాన్సర్ నివారణలో కూడా చాలా ఉపయోగపడుతుంది
కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి సమస్యలను నివారిస్తుంది
బి.పి, షుగర్ ఉన్నవారికి ఎంతో ఉపయోగం
బొప్పాయి జ్యూస్ ..చర్మం పొర చాలా సున్నితంగా, మృదువుగా అవుతుంది