Health Tips: వింటర్లో తరచూ బయటకు వెళ్తున్నారా.. ఆరోగ్యం జాగ్రత్త

Health Tips: వింటర్లో తరచూ బయటకు వెళ్తున్నారా.. ఆరోగ్యం జాగ్రత్త

చలికాలంలో పొద్దున్నే తొందరగా లేవబుద్ధి కాదు. చల్లగా ఉందని చాలామంది ఎక్సర్సైజ్ చేయడానికి బద్ధకిస్తారు. ఈ సీజన్ లో ఎక్కువసేపు ఇంట్లోనే ఉండడం, ఎండ తగలకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు, కొలెస్ట్రాల్ లెవల్స్ లో హెచ్చు తగ్గులు ఏర్పడి డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ సందీప్ పాటిల్. వింటర్ లో హెల్దీగా ఉండేందుకు ఆయన చెప్తున్న జాగ్రత్తలు కొన్ని... 

* ఈ సీజన్ లో గింజధాన్యాలు, చిక్కుడుజాతి గింజలు, నట్స్, సీడ్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. విటమిన్-సి ఉండే నిమ్మ, బత్తాయి వంటి పండ్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్ తక్కువ తినాలి. 

* ఎండ తక్కువ ఉండడం, తేమ వాతావరణం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దాంతో సీజనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వంట్లో ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా వెంటనే డాక్టర్ ని కలవాలి. 

* ఎండలో రోజూ కొంచెం సేపు యోగ, వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తే శరీరం వెచ్చగా ఉంటుంది. 

* వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలి. చల్లని వాతావరణంలో బయటికి వెళ్లేటప్పుడు చేతులను కప్పే బట్టలు వేసుకోవాలి.

* చేతులకి గ్లోవ్స్, కాళ్లకు సాక్సులు, స్వెటర్ తప్పనిసరి. తలకి స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకోవాలి.