ఒమిక్రాన్​ కు ఇన్సూరెన్స్ కంపెనీల కవరేజీ

ఒమిక్రాన్​ కు ఇన్సూరెన్స్ కంపెనీల కవరేజీ
  • ఇవ్వాలని బీమా కంపెనీలకు ఐఆర్​డీఏ ఆదేశం

న్యూఢిల్లీ: హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ హోల్డర్లకు ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​డెవెలప్​మెంట్ అథారిటీ (ఐఆర్​డీఏ) గుడ్​న్యూస్​ చెప్పింది. ఇన్సూరెన్స్​ కంపెనీలన్నీ అన్ని హెల్త్​పాలసీల్లో ఒమిక్రాన్​ ట్రీట్​మెంట్​కు తప్పక కవరేజీ ఇవ్వాలని ఆదేశించింది. దేశంలోని జనరల్​, హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీలన్నింటికీ ఈ రూల్​ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కరోనా ట్రీట్​మెంట్​ ఖర్చు భరించినట్టే ఒమిక్రాన్ బాధితుల ఖర్చూ భరించాలని సూచించింది. రోగి దగ్గర డబ్బు లేకున్నా, క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​సదుపాయం అందించేలా నెట్​వర్క్​ హాస్పిటళ్లతో మాట్లాడి ఒక మెకానిజాన్ని తీసుకురావాలని స్పష్టం చేసింది. క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​ అందిస్తామని కంపెనీలతో చేసుకున్న సర్వీస్​లెవెల్​ అగ్రిమెంట్ల (ఎస్​ఎల్​ఏలు)ను గౌరవించాలని హాస్పిటళ్లకూ ఐఆర్​డీఏ సూచించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మనదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,525 ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 460 కేసులు రాగా, ఢిల్లీలో 351, గుజరాత్‌‌‌‌లో 136, తమిళనాడులో 117, కేరళలో 109 కేసులు వచ్చాయి.