వివిధ కారణాలు చూపి రిజక్ట్ చేస్తున్న కంపెనీలు

వివిధ కారణాలు చూపి రిజక్ట్ చేస్తున్న కంపెనీలు
  • ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ క్లెయిమ్స్‌‌‌‌లో తగ్గని తిప్పలు
  • వివిధ కారణాలు చూపి రిజక్ట్ చేస్తున్న కంపెనీలు
  • మొత్తం రియంబర్స్ కాని క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లే ఎక్కువ

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ ప్రీమియంల ధరలు  విపరీతంగా పెరుగుతున్నప్పటికీ  ఈ పాలసీలు ఇచ్చే కవరేజి మాత్రం అంతగా పెరగడం లేదు. దేశంలోని మెజార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయే తప్ప క్లినికల్ విజిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాలసీ కింద కవర్ చేయడం లేదు. మెడికల్ ఖర్చులు ఎక్కువవ్వడం, కరోనా దెబ్బకు క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతుండడం వంటి కారణాలతో  పాలసీ ప్రీమియంల రేట్లు గత రెండేళ్లలో భారీగా పెరగడాన్ని చూశాం. మరోవైపు పాలసీల క్లయిమ్స్ రిజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వడం కూడా ఎక్కువవుతోంది.  ‘ఇన్సూరెన్స్ కంపెనీతో చర్చించాక, డజను డాక్యుమెంట్లు, కవరేజీ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూర్ చేసిన బిల్లును సబ్మిట్ చేసినా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రియంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందలేకపోయాను’ అని 26 ఏళ్ల ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ ఉద్యోగి రాహుల్ పినాకి మీడియాతో మొరపెట్టుకున్నారు. ఖరీదైన,  క్లిష్టమైన మెడికల్ విధానమని,   పాలసీ కవరేజిలో లేని టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చేసుకున్నాననే    కారణం చూపి క్లయిమ్‌ను రిజెక్ట్  చేశారని చెప్పారు. మరో కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధిషా శర్మా  (57 ఏళ్లు)  కూడా ఇన్సూరెన్స్  క్లయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంది.

‘బకాయిలను చెల్లించాలని ఇన్సూరెన్స్ కాళ్లవేళ్ల పడ్డాను. కాంటాక్ట్ అయిన  కంపెనీ ప్రతినిధులకు ప్రతీసారి అన్ని విషయాలను వివరించాల్సి వచ్చింది’ అని ఆమె అన్నారు.  క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరుకున్నానని,  సర్జరీ తర్వాత రియంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఉంటుందని ఇన్సూరెన్స్ కంపెనీ హామీ ఇవ్వడంతోనే సర్జరీకి చేయించుకున్నానని అన్నారు. ‘సర్జరీ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడామని డాక్టర్లు తెలియజేశారు. ఇందుకు అదనంగా మరో రూ. 85 వేలు కట్టాలన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇందులో మ్యాగ్జిమమ్ రూ.23 వేలే చెల్లించడానికి ముందుకొచ్చింది. రూ.15 లక్షల కవరేజి అయినా కూడా ఈ డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కవర్ చేయలేకపోయింది’ అని విధిశా శర్మా అన్నారు.  ఈ సంఘటనలేవి కూడా మొదటిసారి విన్నవి కావు.  దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్లకు చెల్లించాల్సినంత అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెల్లించడం లేదు. కెనడా, ఆస్ట్రేలియా, యూకేలతో పోలిస్తే దేశంలో హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదులు ఎక్కువగానే  నమోదవుతున్నాయి. చాలా పాలసీలు అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్  విజిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కవర్ చేయడానికి అదనంగా ఛార్జ్ చేస్తున్నాయి. బేసిక్ కవరేజిలో వీటిని పొందడానికి అవ్వడం లేదు. 

ప్రభుత స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌లతో ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌..

యూఎస్‌‌‌‌‌‌‌‌, చైనా దేశాలతో పోలిస్తే ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్  సెక్టార్ పెద్దగా విస్తరించలేదు.  దేశ జనాభాలో కేవలం 0.4 శాతం మంది మాత్రమే హెల్త్ పాలసీలు తీసకుంటున్నారు. ఇందుకు  ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌పైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే  ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండడం మరో కారణం. ఆదాయం తక్కువ ఉన్నవారి కోసం  ప్రభుత్వం వివిధ స్కీమ్‌‌‌‌‌‌‌‌ల కింద ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ పాలసీలను తీసుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ యోజన, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్‌‌‌‌‌‌‌‌, ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ స్టేట్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌, ప్రధాన్‌‌‌‌‌‌‌‌ మంత్రి సురక్ష బీమా యోజన, ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ బీమా యోజన వంటి స్కీమ్‌‌‌‌‌‌‌‌ల కింద ప్రజలకు ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ కవరేజిని అందిస్తోంది.

సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రేషియో..

ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మే పాలసీలు చూసినప్పుడు మా సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రేషియో 90 శాతమని, 95 శాతమని ప్రకటించుకుంటాయి. అంటే 90 శాతం సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రేషియో ఉంటే ఇచ్చిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 100  క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 90 మాత్రమే ప్రాసెస్ చేసినట్టు. మిగిలిన 10 పాలసీ క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిజెక్ట్ చేసినట్టు.  ఇంకా 95 శాతం  సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రేషియో కూడా కస్టమర్ల వైపు నుంచి కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు  ప్రాసెస్ చేసిన క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే రిప్రెజెంట్ చేస్తాయని ఇన్సూరెన్స్ సమాధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిహాలని అన్నారు.  అంటే క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమౌంట్ పూర్తిగా సెటిల్ చేయకపోయినా  ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పాలసీలను సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రేషియో కింద చూస్తాయని అన్నారు. చాలా మంది కస్టమర్లకు  పాలసీ ఏం కవర్ చేస్తుంది? ఏం చేయదో కూడా తెలియడం లేదని పేర్కొన్నారు.  ఇన్సూరెన్స్ కంపెనీలు  పాలసీ హోల్డర్ల క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిజెక్ట్ చేయడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఇచ్చిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాలసీ హోల్డర్లు అవసరమైన  డాక్యుమెంట్లను సబ్మిట్ చేయలేకపోవడం ఒకటి. పాలసీ తీసుకునేటప్పుడు కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనకున్న రోగాన్ని బయటపెట్టలేదనే కారణంతో కొన్నిసార్లు క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిజెక్ట్ చేస్తున్నారు. కొంత మందికి పాలసీ తీసుకునే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమకు ఆ రోగం ఉందని కూడా తెలియని సందర్భాలూ ఉన్నాయి.