సీఎం రేవంత్​ రెడ్డితో డబ్ల్యూఏ మంత్రి అంబర్-జేడ్ భేటీ

సీఎం రేవంత్​ రెడ్డితో డబ్ల్యూఏ మంత్రి అంబర్-జేడ్  భేటీ

హైదరాబాద్, వెలుగు: హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, మెడికల్  లైఫ్ సైన్సెస్ రంగాలలో తెలంగాణతో సంబంధాలను బలోపేతం చేయడానికి పశ్చిమ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ)  ఆరోగ్యశాఖ మంత్రి అంబర్-జేడ్ శాండర్సన్ హైదరాబాద్​లో మంగళవారం సీఎం రేవంత్​ రెడ్డితో భేటీ అయ్యారు.  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్,  లైఫ్ సైన్సెస్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణతో "గ్లోబల్ పార్టనర్"గా జట్టుకట్టడానికి తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని వెల్లడించారు.

 ఆమె ఈ నెల 25 నుంచి 27 వరకు నగరంలో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ ప్రతినిధి బృందం ఆరోగ్యం  లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్  వంటి వివిధ పరిశ్రమల ప్రతినిధులతోనూ చర్చించింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి 2033 నాటికి అదనంగా 5,000 మంది డాక్టర్లు,  నర్సులు అవసరమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.