బ్లడ్ బ్యాంకు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌‌‌‌పై మంత్రి రివ్యూ

బ్లడ్ బ్యాంకు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌‌‌‌పై మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో సుమారు పదేండ్లుగా కాంట్రాక్ట్ బేసిస్ పై పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా గురువారం అధికారులతో రివ్యూ చేశారు. సెక్రటేరియెట్‌‌‌‌లో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్, డీఎంఈ వాణి, వీవీపీ కమిషనర్ అజయ్‌‌‌‌ కుమార్, పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అమర్‌‌‌‌‌‌‌‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న బ్లడ్‌‌‌‌ బ్యాంకుల్లో ఎంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నది.. అందులో ఎవరెవరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నది అధికారులు మంత్రికి వివరించారు.

రెగ్యులరైజేషన్‌‌‌‌కు ఉన్న అవకాశాలపై చర్చించారు.17 ఏండ్లుగా తాము కాంట్రాక్ట్‌‌‌‌ బేసిస్‌‌‌‌పై పనిచేస్తున్నామని, తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఇటీవల బ్లడ్ బ్యాంకు ఉద్యోగులు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఈ అంశంపై రిపోర్ట్ ఇవ్వాలని హెల్త్ సెక్రటరీకి సీఎంవో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి రివ్యూ చేశారు. బ్లడ్ బ్యాంకుల పనితీరుపై ఆరా తీశారు. బ్లడ్ డొనేషన్ డే(జూన్ 14) ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.