ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కింది

ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కింది

ఏ ప్రభుత్వానికైనా వందకు వంద శాతం పనులు చేయడం సాధ్యం కాదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించండి అని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి కళా నిలయంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం వజ్రోత్సవ సంబరాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఉపాధ్యాయులకు 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందన్నారు.  సిద్దిపేట జిల్లా కావాలని జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని చెప్పారు. 

‘మిషన్ భగీరథ’కు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని, ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని మంత్రి హరీష్ రావు అన్నారు. 24 గంటల పాటు కరెంటు ఇచ్చి.. శాశ్వతంగా సమస్యను తొలగించామన్నారు. టీఆర్ఎస్ పరిపాలనలో ఏనాడైనా కరెంటు, నీళ్ల సమస్యల గురించి అసెంబ్లీలో విపక్షాల నిరసనలు జరిగాయా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని చెట్లతో కూడిన పల్లెలు స్వాగతం పలుకుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారీగా విద్యకు ఖర్చు పెడుతోందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు 3,300 కోట్లు అని చెప్పారు.