పేదలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మబంధువులు

పేదలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి  ఆత్మబంధువులు

పేదలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి ఆత్మబంధువులని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుపేదలకు సాయం చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వం విధి అని చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించిందన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్ని కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని తెలిపారు. సిద్దిపేట సీఎస్ఐ చర్చిలో  క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు  కేక్ కట్ చేసి  ఫాస్టర్లకు, క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సిద్దిపేట సీఎస్ఐ చర్చి నిర్మితమై150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.