గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు

గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు

గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. కోవిన్ రిజిస్ట్రేషన్ ద్వారా అయినా, వాక్ ఇన్ అయినా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. దీనికి
సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పటివరకు గర్భిణీలు, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడంలేదు. ఈ మధ్య పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం
ప్రకటించింది. ఇప్పుడు గర్భిణీలు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు పాలసీలో మార్పులు చేసింది. గర్భిణీలకు వ్యాక్సిన్ బాగా ఉపయోగపడుతుందని... వారికి కచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ICMR
డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఈ మధ్యే ప్రకటించారు. గర్భిణీలకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై నుషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ మీటింగ్ లో మే నెలలోనే చర్చలు జరిగాయి.