గర్భిణీలకు కరోనా వచ్చినా భయమేమీ లేదు

గర్భిణీలకు కరోనా వచ్చినా భయమేమీ లేదు

న్యూఢిల్లీ: ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన మహిళలకు కరోనా వైరస్ ప్రమాదం పెరగదని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా బారిన పడిన 90% మందికి పైగా గర్భిణులకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని చెప్పింది. అయితే కొన్ని సందర్భాల్లో.. ఆరోగ్యం త్వరగా క్షీణించే ప్రమాదం ఉందని, కడుపులోని పిండంపైనా ప్రభావం పడుతుందని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రెగ్నెంట్లు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. గర్భిణులకు వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ వర్కర్లను గైడ్ చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ఫ్యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్ ప్రిపేర్ చేసింది. సింప్టమ్స్ ఉన్న ప్రెగ్నెంట్లకు కరోనా తీవ్రత ఎక్కువ ఉండొచ్చని అందులోచెప్పింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఇతర రోగుల మాదిరిగానే గర్భిణులకు కూడా ఆస్పత్రిలో చేర్చాలని వివరించింది. హైబీపీ, ఒబెసిటీ, 35 ఏళ్లు పైబడిన గర్భిణులకు కరోనా వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది. వ్యాక్సిన్ గురించి గర్భిణులకు ఫ్రంట్ లైన్ వర్కర్లు, వ్యాక్సినేటర్లు.. కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడిన ప్రెగ్నెంట్లకు డెలివరీ చేయగా.. 95 శాతం మంది పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే.. నెలలు నిండకముందే డెలివరీ, బేబీ బరువు తక్కువగా ఉండటం జరుగుతుందని, అతితక్కువ సందర్భాల్లో కడుపు లోపలే బేబీ చనిపోవడం వంటివి జరుగుతాయని వెల్లడించింది. ప్రెగ్నెన్సీ సమయంలో కరోనా బారిన పడిన వాళ్లు.. డెలివరీ అయిన తర్వాత వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలంది. వ్యాక్సిన్లు సేఫ్ అని, కరోనా నుంచి ప్రెగ్నెంట్లను కాపాడుతుందని చెప్పింది.