రస్క్​ తో ఆరోగ్య సమస్యలు

రస్క్​ తో ఆరోగ్య సమస్యలు
  • సెలియాక్​ వ్యాధిగ్రస్తులు తింటే.. చిన్నపేగులకు దెబ్బ
  • నాసిరకం ముడిపదార్థాలతో తయారీ
  • రస్క్​ రంగు, రుచి, నిల్వ కోసం కెమికల్స్​ వాడకం

చాయ్​, రస్క్​ కాంబినేషన్​చాలామందికి ఇష్టం. బ్రేక్​ ఫాస్ట్​, ఈవినింగ్​ స్నాక్స్​ టైంలో ఈ కాంబినేషన్​ అదుర్స్​ అని ఫుడ్​ లవర్స్​ చెబుతుంటారు. కొంతమందైతే వేళాపాళా లేకుండా టీ తాగినప్పుడల్లా రస్క్​ ఉండాల్సిందేనని అంటుంటారు. అయితే రస్క్​ లో దాగిన రిస్క్​ గురించి.. దాన్ని తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది  ఆలోచించరు. రస్క్​ తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ముసురుకునే ముప్పు ఉంటుందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టేస్టీ రస్క్​.. హెల్త్​ కు రిస్క్ గా ఎలా మారుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. ‌‌

ఎండిపోయిన బ్రెడ్​ ముక్కలు 

కొన్ని బేకరీల్లో ఎండిపోయిన బ్రెడ్​ ముక్కలతోనూ  రస్క్​లు తయారు చేస్తుంటారని మరో స్టడీ రిపోర్ట్​ చెబుతోంది. ఎండిపోయిన బ్రెడ్​ పై వ్యాధికారకాలు, బూజు, ఫంగస్​ వంటివి పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని.. అటువంటి వాటితో తయారుచేసే రస్క్​ మన హెల్త్​ కు రిస్క్​ ఫుల్​ అని ఆ నివేదికలో పేర్కొన్నారు.  ఫలితంగా అతిసారం, ఫుడ్​ పాయిజనింగ్​, మలబద్ధకం వంటి వాటి బారినపడే ముప్పు ఉంటుందని తెలిపారు.

బొంబాయి రవ్వ కాదు.. మైదాపిండితో..

వాస్తవానికి రస్క్ తయారీకి బొంబాయి రవ్వను వాడాలి. కానీ మైదా పిండిని ఎక్కువ మోతాదులో, బొంబాయి రవ్వను అతి తక్కువ మోతాదులో కలిపి బేకరీల్లో రస్క్​ను  తయారు చేస్తుంటారు. చాలా బేకరీల నిర్వాహకులు లాభాలను పెంచుకునేందుకు ఇలా చేస్తుంటారు. అందుకే రస్క్​ తిన్నాక.. జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. అంతేకాకుండా శరీర బరువు పెరిగేందుకు కారణమవుతుంది. 

రంగు మాటున రిస్క్​ 

రస్క్​కు ఉండే రంగు లో కూడా రిస్కు దాగి ఉంది. దానికి ఆ రంగు వచ్చేలా చేయడానికి క్యారమెల్​ రంగును లేదా బ్రౌన్​ఫుడ్​ కలర్​ ను వాడుతారు. ఇది మన ఆరోగ్యానికి చేటు చేస్తుంది. మైదాతో తయారు చేసే రస్క్​ను.. గోధుమపిండితో తయారు చేసినట్టుగా లుక్​ ఇచ్చి ఫుడ్​ లవర్స్​ను అట్రాక్ట్​ చేసేందుకు పిండిలో రంగును కలుపుతారు. 

షెల్ఫ్​ లైఫ్​ కోసం కెమికల్స్​ 

రస్క్​ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేందుకు  అందులో కొన్ని కెమికల్స్​ వాడుతారు. 

చీప్ ఆయిల్​ 

 రస్క్​ తయారీకి రిఫైన్డ్​ ఆయిల్​ ను వాడే బేకరీలు తక్కువే ఉంటాయి. చాలాచోట్ల నాసిరకం నెయ్యి లేదా పామాయిల్స్​ ను వాడుతుంటారు. మన శరీర టెంపరేచర్​ వద్ద గడ్డకట్టే గుణం కలిగిన ఇటువంటి తక్కువ రకం ఆయిల్​తో తయారు చేసే రస్క్​ను తింటే గుండెపై దెబ్బ పడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ముప్పు పెరుగుతుంది. 

సెలియాక్​ వ్యాధిగ్రస్తులూ పారా హుషార్​

గ్లూటెన్​ అనేది బియ్యం, గోధుమలు వంటి ధాన్యాల్లో ఉండే ప్రొటీన్​. రస్క్​లో ఇది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.  సెలియాక్(celiac) అనేది ఆటో ఇమ్యూన్​ వ్యాధి. దీని బాధితులు గ్లూటెన్​ ఎక్కువున్న ఫుడ్స్​ తీసుకోవడం మంచిదికాదు. ఒకవేళ సెలియాక్​ వ్యాధిగ్రస్తులు రస్క్​ తింటే చిన్నపేగులు దెబ్బతినే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

రస్క్​ను తిని తీరాలని భావిస్తే ..

100 శాతం గోధుమ లేదా బొంబాయి రవ్వతో తయారు చేసిన రస్క్​ను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రస్క్​ ప్యాకెట్లను కొనే ముందు లేబుల్స్​ ను, ఎక్స్ పైరీ డేట్​ను  చెక్​ చేసుకోవాలని చెబుతున్నారు.

ఫుల్లు షుగర్

రస్క్​లో తియ్యదనం రావడానికిగానూ.. దాని తయారీకి రిఫైన్డ్​ షుగర్​ను పెద్దమొత్తంలో వాడుతా రు. ​ ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఫుల్లుగా షుగర్​ ఉండే రస్క్​ను మితిమీరి తింటే రక్తంలో షుగర్​ లెవల్స్​ పెరిగిపోతాయని వైద్య నిపుణులు అంటున్నారు. చివరకు ఇది డయాబెటిస్​ వ్యాధికి కూడా దారితీస్తుందని వార్నింగ్​ ఇస్తున్నారు.
చాయ్​,  రస్క్​ కాంబినేషన్​చాలామందికి ఇష్టం. బ్రేక్​ ఫాస్ట్​, ఈవినింగ్​ స్నాక్స్​ టైంలో ఈ కాంబినేషన్​ అదుర్స్​ అని ఫుడ్​ లవర్స్​ చెబుతుంటారు. కొంతమందైతే వేళాపాళా లేకుండా టీ తాగినప్పుడల్లా రస్క్​ ఉండాల్సిందేనని అంటుంటారు. అయితే రస్క్​ లో దాగిన రిస్క్​ గురించి.. దాన్ని తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది  ఆలోచించరు. రస్క్​ తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ముసురుకునే ముప్పు ఉంటుందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టేస్టీ రస్క్​.. హెల్త్​ కు రిస్క్ గా ఎలా మారుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. ‌‌

ఎక్కువ తింటే..

రస్క్​ను ఎక్కువగా తినేవారికి పెద్దపేగులో అల్సర్లు వచ్చే చాన్స్​ ఉంటుంది. కడుపులో గ్యాస్​ రావడం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు చుట్టుముట్టొచ్చు. రస్క్​ లో కార్బోహైడ్రేట్స్​ అత్యధిక మోతాదులో ఉంటాయి. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘మాయో క్లినిక్​ మెడికల్ జర్నల్​’ లో ఇటీవల ప్రచురితమైన ఒక స్టడీ రిపోర్ట్​ ప్రకారం.. బ్రెడ్​ కంటే రస్క్​లో ఎక్కువ క్యాలరీ లెవల్స్​ ఉంటాయి. 100 గ్రాముల రస్క్​ లో దాదాపు 407 కిలోక్యాలరీస్​ ఉంటాయి. ఇక ఇదే సమయంలో వైట్​ బ్రెడ్​ లో 281 కిలో క్యాలరీస్​ మాత్రమే ఉంటాయి. రస్క్​ ను ఒకవేళ పాలతో తింటే మన శరీరంలో ట్రై గ్లిజరాయిడ్స్​ మోతాదులు పెరుగుతాయి. ఫలితంగా మన జీర్ణక్రియలు గాడితప్పుతాయి. ఇది చివరకు  ఒబెసిటీ, హృద్రోగ సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.