Health Tip : గ్రీన్ టీ ఎక్కువ తాగొద్దు

Health Tip : గ్రీన్ టీ ఎక్కువ తాగొద్దు

బరువు తగ్గేందుకు చాలామంది గ్రీన్ టీ తాగుతుంటారు. కొంతమంది మూడుపూటలా తాగడమే కాకుండా.. ఎప్పుడు టీ తాగాలనిపిస్తే అప్పుడు గ్రీన్ టీ తాగుతుంటారు. దానివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట. గ్రీన్ టీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రోజుకు మూడు కప్పులు మించి తాగితే తలనొప్పి, యాంగ్జెటీ, ఇరిటేషన్ వంటివి పెరుగుతాయి.

• గ్రీన్ టీలో ఉండే పాలిఫినాల్స్ వల్ల కడుపులో యాసిడ్ పర్సెంటేజ్ ఎక్కువవుతుంది. కడుపునొప్పి, మంట లాంటివి వస్తాయి.
• గ్రీన్ టీ ఎక్కువగా తాగితే ఒంట్లోని ఐరన్ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. యాంటీ బయాటిక్స్, ఆస్తమా లాంటి సమస్యలకు మెడిసిన్ తీసుకునేవాళ్లు గ్రీన్ టీ తాగితే లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.