Health Tip : ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోవచ్చు..

Health Tip : ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోవచ్చు..
  •  ముప్పావు కప్పు ఎండబెట్టిన గులాబీ రేకులు లేదా అరకప్పు తాజా గులాబీ రేకుల్ని శుభ్రంగా కడగాలి.
  • • వెడల్పాటి గిన్నెలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి, మరిగించాలి.
  • • గులాబీ రేకులు వేసి, సన్నటి మంట మీద మరి కాసేపు మరిగించాలి. గులాబీ రేకులు రంగు మారాక స్టవ్ ఆపేయాలి.
  • • ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక నీళ్లని వడగట్టి, గాజు సీసాలోకి తీయాలి.
  • • ఆ తర్వాత వారం, పది రోజులు ఫ్రిజ్లో పెడితే రోజ్ వాటర్ రెడీ.
  • • కావాలనుకుంటే గులాబీ పువ్వు మధ్యలో ఉండే కేసరాలని గులాబీ రెమ్మలతో కలిపి మరిగించొచ్చు. దీనివల్ల మంచి వాసన వస్తుంది. అయితే ఈ ప్రాసెస్కి కేవలం నాటు గులాబీలని మాత్రమే వాడాలి.
  • రోజ్ వాటర్లో విటమిన్-ఎ.సి.డి. ఈలతో పాటు యాంటీ ఏజెనింగ్ ప్రాపర్టీలు ఉంటాయి. అందుకే చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.

 ALSO READ :Krishna Janmashtami 2023 : పిల్లలకు శ్రీకృష్ణుడు గురించి ఇలా చెప్పాలి..