Health Tip : గుమ్మడి గింజలు ఆరోగ్యం అని ఎక్కువ తినొద్దు.. డేంజర్

Health Tip : గుమ్మడి గింజలు ఆరోగ్యం అని ఎక్కువ తినొద్దు.. డేంజర్

పెపిటాస్.. గుమ్మడి గింజల ముద్దుపేరు. రోస్ట్ చేసి అందిస్తే.. క్షణంలో ప్లేట్ ఖాళీ. వీటి టేస్ట్ అలాంటిది. ప్రొటీన్ రిచ్ ఫుడ్ కావడంతో ఈమధ్య వీటిని ఎక్కువగా తింటున్నారు. అయితే ఎక్కువ తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనుకుంటే పొరపాటే.. వీటి వల్ల కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. గుమ్మడి పండు కోశాక అందులోని గింజలను తీసి ఎండబెడతారు. తర్వాత వాటిని స్టోర్ చేసుకుని నచ్చినట్టు తింటారు. 

నట్స్ లో దీనిది ఒక డిఫరెంట్ టేస్ట్. చిన్నపాటి స్వీట్ నెస్తో నోరూరిస్తుంది. వీటిలో జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, నియాసిన్, ట్రిప్టోఫాన్ వంటి న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి రక్త నాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. 

30గ్రాముల గుమ్మడి గింజల్లో సుమారు 150 క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. అందుకే వీటిని న్యూట్రిషన్ పవర్ హౌస్ ని అంటారు. ' అతి ఎప్పుడూ అనర్థదాయకం' అన్నమాట వీటిని తినేటప్పుడు గుర్తుంచుకోవాలి. దొరికాయి కదా అని గుప్పిళ్ళ కొద్దీ లాగించేస్తే.. తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో చాలా ఇబ్బంది పడాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు రోజుకు 30 గ్రాములకు మించి తినడం మంచిది కాదని చెప్పారు. అంత కన్నా ఎక్కువ తింటే మేలు కన్నా కీడే ఎక్కువ అంటున్నారు. 

సైడ్ ఎఫెక్ట్స్ ఇవి.. 

• గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ముందు కడుపు నొప్పి వస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఫామ్ అవుతుంది. వీటిలోని ఫ్యాటీ ఆయిల్స్ వల్ల ఈ   సమస్య ఎక్కువ అవ్వొచ్చు.
• కొంతమందికి ఇవి అలర్జీని కలిగిస్తాయి. గొంతులో ఇరిటేషన్, దగ్గు, కఫం చేరే అవకాశం ఉంది. ఒక్కోసారి తలనొప్పి కూడా వస్తుంది. 
• ఈ గింజల్లో పోషకాలు, క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తొందరగా పెరుగుతారు. సన్నబడాలని అనుకుంటే మాత్రం వీటిని తినకపోవడమే     బెటర్. 
•లో బీపీ ఉన్నవాళ్ళు వీటిని తినడం మంచిది కాదు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది. తినాలని అనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. 
• మూడేళ్ల లోపు పిల్లలకు వీటిని పెట్టొద్దు. వీటిలోని ఫైబర్, ఫ్యాటీ యాసిడ్ల వల్ల కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. 
•గుమ్మడి గింజ ల్లోని పోషకాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే.. సలాడ్స్ లాంటి వాటిలో కలిపి తీసుకుంటే మంచిది. సన్న గ్రైండ్ చేసి శ్నాక్స్,   జ్యూసెస్, ఐస్క్రీమ్స్ మీద చల్లి తిన్నా బాగుంటుంది.