కాళ్లు నొస్తున్నయా? ఇట్ల చెయ్యిన్రి..

కాళ్లు నొస్తున్నయా? ఇట్ల చెయ్యిన్రి..

కాళ్లు చేతులు గుంజుతుంటే.. నిద్ర రాదు.. కూసుంటే మన్సునవట్టది. మరి ఈ నొప్పులు తగ్గాలంటే ఏం చేయాల? ఇదిగో.. ఇట్ల చేస్తె అడ్వర్టైజ్మెంట్ల చెప్పినట్లు ‘ మీ నొప్పులు మటు మాయం’ అయితై! మరి అవేంటో ఓసారి తెల్సుకుందమా..

నొప్పులు ఎక్కువగా ఉన్నయి కదా అని మెడికల్​ దుకాణంలకు పోయి గోలీలు తెచ్చి ఏసుకోకుండ్రి. ఎందుకంటే.. ఇయ్యాల నొప్పులు తగ్గినా రేపు ఎన్నో సమస్యలు వస్తయట. మరి ఇటువంటి సైడ్​ఎఫెక్ట్స్​ లేకుండా నొప్పులు తగ్గిపోవాలంటే వేడి నీళ్లల్ల తువ్వాలను ముంచి నొప్పి ఎక్కువ ఉన్నదగ్గర జరసేపు ఉంచాల్నట.

పసుపుతో చాయ్​ చేసుకొని తాగితే కూడా మంచి రిలీఫ్​ ఉంటది. ఒక గ్లాస్​ నీళ్లు తీస్కొని.. పొయ్యిమీద గరమ్​ చేసుకొని, దాంట్ల కొద్దిగ పసుపు వేసి.. సగం నిమ్మకాయ పిండి.. వేడివేడిగ ఉండంగనే తాగెయ్యాల.  పసుపుల ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తయ్​.