ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు

ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు

ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు. రసం, సాంబారు, పచ్చళ్లు, తాలింపుల్లో మాత్రమే దీన్ని వాడుతుంటారు చాలామంది. కానీ అన్ని కూరల్లో ఇంగువ వేసి తింటే ఆరోగ్యాని కి చాలామంచిది. ఇంగువతో ఎన్ని లాభాలో ఒకసారి చూద్దాం…ఇంగువను రెగ్యులర్‌‌‌‌గా తింటే గ్యాస్, కడుపు నొప్పిలాంటి సమస్యలు తగ్గుతాయి. యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీలు ఇంగువలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, దీన్ని రెగ్యులర్‌‌‌‌గా తినడం వల్ల శ్వాస సమస్యలుఉండవు. వేడి నీళ్లలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే తలనొప్పి మాయమవుతుంది. కడుపులో నులిపురుగుల సమస్య ఉన్నా వాముతో కలిపి తింటే తగ్గుతుంది. వారానికి రెండుసార్లు అన్నంలో మొదటి ముద్ద నెయ్యి, వాము, ఇంగువతో కలిపి తింటే జీర్ణ సమస్యలుండవు.