కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వైరైటీ ప్రచారం

V6 Velugu Posted on Sep 24, 2021

తెలంగాణ: కరోనా వైరస్ గత కొంతకాలం నుంచి ప్రపంచాన్ని వణికిస్తోంది. శాస్త్రవేత్తల కృషితో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే యావత్ ప్రపంచం మహమ్మారి నుంచి కోలుకుంటోంది. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. మనదేశంలో కూడా వ్యాక్సిన్ తీసుకోవలసిన అవసరంపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో జరిగిన అలాంటి అవగాహన కార్యక్రమాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి.

కొంతమంది హెల్త్ వర్కర్లు కరోనా వ్యాక్సిన్ డబ్బాలను తీసుకొని.. కరోనా వ్యాక్సిన్.. కరోనా వ్యాక్సిన్ అంటూ కాలనీల్లో తిరుగుతూ అందరినీ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు. ఫస్ట్ డోస్ అయినా, సెకండ్ డోస్ అయినా సరే వేయించుకోని వాళ్లుంటే వేయించుకోవాలని అడుగుతూ కార్యక్రమం చేపట్టారు.

తెలంగాణలోని మరోచోట కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లకు కంట్రోల్ బియ్యం బంద్, పింఛన్ బంద్, నీళ్లు బంద్ అంటూ దండోరా వేయించారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఇవన్నీ సప్లై జరుగుతాయని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే.. తట్టాబుట్టా సర్దుకొని ఊర్లో కనబడకుండా వెళ్లిపోవాలని.. ఇది ఖచ్చితంగా అమలు చేయబడుతుందని చాటింపు వేయించారు.

For More News..

గడ్డిపోచలా తీసేస్తే.. గడ్డపార అవుతానని అనుకోలేదు

ప్రారంభమై.. వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు

కొవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే శ్రీవారి దర్శనం

Tagged corona vaccine, corona virus, Vaccination, Health Workers, variety campaign for vaccination

Latest Videos

Subscribe Now

More News