గుడ్లను ఫ్రిజ్‍ లో ఇలా పెట్టండి.. అప్పుడే హెల్దీ ఎగ్స్ తింటారు

గుడ్లను ఫ్రిజ్‍ లో ఇలా పెట్టండి.. అప్పుడే హెల్దీ ఎగ్స్ తింటారు

కోడిగుడ్లు నిల్వ ఉండేందుకు గాను ఫ్రిజ్ పెడతారు. కానీ అలా పెట్టడం సరైంది కాదంటున్నారు పరిశోధకులు. ఫ్రిజ్‍ డోర్ ఉండే ర్యాక్ గుడ్లను నిల్వ చేస్తే త్వరగా పాడైపోతాయని పరిశోధనల్లో తేలింది. డోర్‍ అస్తమాను తెరుస్తూ.. మూస్తూ ఉండటం వల్ల ఉష్ణో గ్రతల్లో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. ఇది గుడ్డులోని పచ్చసొన పై ప్రభావం చూపుతుంది. దానివల్ల గుడ్లు పాడైపోతాయని ఆహార
నిపుణులు అంటున్నారు. కాబట్టి వాటిని క్లోజ్‍ ట్రేలో పెట్టి ఫ్రిజ్ పెట్టాలి. అలా చేయడం వల్ల డోర్‍ వేసినా, తీసినా మారే ఉష్ణో గ్రతల ప్రభావం వాటిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థిర ఉష్ణో గ్రత ఉన్నచోట అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వాటర్ బాటిల్స్ లాంటివి మాత్రమే ఫ్రిజ్ డోర్‍ ర్యాక్ ఉంచవచ్చట. అలాగే ఫ్రిజ్ పెట్టే ఆహార పదార్థాల గిన్నెలపై మూతలు పెట్టడం మంచిదంటున్నారు.